కేరళ ఫేమస్ కసవు చీర. బంగారు అంచుతో కూడిన తెల్లటి లేదా క్రీమ్ రంగు చీర. వీటిని సాధారణంగా పండుగలు, వివాహాలు, ఇతర శుభ సందర్భాలలో కట్టుకోవడానికి ఇష్టపడతారు.
woman-life Jun 01 2025
Author: Rajesh K Image Credits:Social media
Telugu
పోచంపల్లి ఇక్కత్ చీర - తెలంగాణ
తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ చీరలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కత్ అనేది ఒక ప్రత్యేకమైన నేత పద్ధతి, దీనిలో దారాలకు రంగులు వేసి, తర్వాత చీరను నేస్తారు.
Image credits: Social media
Telugu
కాంచీపురం పట్టు చీర - తమిళనాడు
కాంచీపురం పట్టు చీర అనేది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో తయారుచేయబడుతుంది. ఇది దాని మల్బరీ పట్టు, జరీ సరిహద్దులకు ప్రసిద్ధి చెందింది.
Image credits: Social media
Telugu
చందేరి చీర - మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ కు చెందిన చందేరి చీరలు దేశవ్యాపంగా ప్రసిద్ధి చెందాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో తయారు చేస్తారు. ఈ చీరలను పత్తి, పట్టు నూలుల కలయికతో నేస్తారు.
Image credits: social media
Telugu
ముగా సిల్క్ చీర -అస్సాం
అస్సాంకు చెందిన ముగా సిల్క్ చీరలు కూడా చాలా ఫేమస్. ముగా సిల్క్ అనేది ఒక ప్రత్యేక రకం పట్టు, అక్కడ స్థానికంగా లభించే ఆంథెరియా అస్సామెన్సిస్ అనే పురుగు ద్వారా ఉత్పత్తి చేస్తారు.
Image credits: instagram
Telugu
సంబల్పురి ఇక్కత్ చీర - ఒడిశా
ఒడిశాకు చెందిన సంబల్పురి ఇక్కత్ చీరలు (Sambalpuri Ikat Saree) ఒక ప్రసిద్ధమైన చేనేత చీర. ఈ చీరలు నేసే ముందు దారానికి ప్రత్యేక రీతిలో ముళ్లు వేసి రంగులు అద్దుతారు.
Image credits: Pinterest
Telugu
పటోలా చీర - గుజరాత్
గుజరాత్‌కు చెందిన పటోలా చీర అనేది డబుల్ ఇకత్ నేతతో తయారు చేసిన ఒక ప్రసిద్ధమైన చీర. ఇది పట్టుతో నేయబడుతుంది. చాలా ఖరీదైనది, పటాన్ నగరంలో దీనిని ఉత్పత్తి చేస్తారు.