Woman
పాలను ముఖానికి వాడితే మీరు కొరియన్ అమ్మాయిల్లాంటి గ్లాస్ స్కిన్ ను పొందుతారు. పాలలో ఉండే లక్షణాలు మన ముఖాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
అవును ఫేష్ వాష్ కాకుండా మీరు పాలతో ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ఇందుకోసం రెండు స్పూన్ల పాలలో ఒక స్పూన్ తేనెను కలిపి వాడాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగాలి.
ఇలా గనుక పాలను మీ ముఖానికి వాడితే మీ చర్మం తేమగా ఉంటుంది. అలాగే అందంగా మెరుస్తుంది.
మెరిసే ముఖం కోసం మీరు పాల ఫేస్ ప్యాక్ ను కూడా వాడొచ్చు. ఇందుకోసం 4 స్పూన్ల పచ్చి పాలలో 2 స్పూన్ల బియ్యం పొడిని వేసి పేస్ట్ చేయండి.
ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మీరు ఈ ఫేస్ ప్యాక్ లో రోజ్ వాటర్ ను కలిపి కూడా పెట్టొచ్చు. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గిపోతాాయి.