Woman
చెవుల దగ్గర లేదా చెవిపై మొటిమలుంటే మూత్ర వ్యవస్థ లేదా కిడ్నీకి సంబంధించిన సమస్యలకు సంకేతమంటున్నారు నిపుణులు. వీళ్లను నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉప్పు తక్కువగా వాడాలి.
బుగ్గలపై మొటిమలు ఉండటం అలెర్జీ లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం కావొచ్చు. ఇలాంటి వారు పిల్లో కవర్లను ఎక్కువగా మార్చాలి. కాలుష్యం, దుమ్ముకు దూరంగా ఉండాలి.
నుదిటిపై మొటిమలు ఉండటం జీర్ణవ్యవస్థ లేదా కాలేయ సమస్యకు సంకేతం కావొచ్చు. వీళ్లు నీళ్లను ఎక్కువగా తాగాలి, గ్రీన్ టీ, ఫైబర్ ఉన్న పదార్థాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.
ముక్కుపై మొటిమలు ఉండటం హైబీపీ, రక్త ప్రసరణ సమస్య, కడుపు, గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావొచ్చు. వీళ్లు కారం, నూనె పదార్థాలను తగ్గించాలి. రోజూ వ్యాయామం చేయాలి.
గడ్డంపై మొటిమలు హార్మోన్ల అసమతుల్యత, జీర్ణవ్యవస్థ సమస్యల వల్ల వస్తాయి. వీళ్లు షుగర్ ను తగ్గించాలి. డాక్టర్ల సలహా తీసుకోవాలి.
హార్మోన్ల మార్పులు లేదా పిసిఒడి, పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ వల్ల దవడ దగ్గర మొటిమలు అవుతాయి. వీళ్లు హార్మోన్ల పరీక్షలు చేయించుకోండి. పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి.