ఎంత కడిగిన పాత్రలపై మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్!
woman-life Jun 17 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
మంట తగ్గించండి
వంట చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా తక్కువ మంట మీద చేయాలి. లేదంటే పాత్రలు మాడిపోయి జిడ్డుగా, నల్లగా మారుతాయి.
Image credits: Getty
Telugu
వినెగర్
పాత్రలపై మరకలను తొలగించడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. వెనిగర్ , ఉప్పు కలిపి ఒక ద్రావణంతో శుభ్రం చేస్తే మరకలు ఇట్టే పోతాయి.
Image credits: Getty
Telugu
బేకింగ్ సోడాతో పాత్రలు కడగడం
పాత్రలను మెరుస్తూ ఉండటానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్ లా చేసి, ఆ మిశ్రమంతో మరకలపై రుద్దితే.. సులభంగా మరకలు పోతాయి.
Image credits: Getty
Telugu
ఉల్లిపాయ
పాత్రలో నీళ్ళు పోసి ఉల్లిపాయ వేసి మరిగించాలి. స్టీల్ పాత్రలోని మరకలను ఇది తొలగిస్తుంది.
Image credits: Getty
Telugu
గ్లిజరిన్, లిక్విడ్ సోప్‌తో
రెండు కప్పుల నీరు, పావు కప్పు గ్లిజరిన్, మరో పావు కప్పు లిక్విడ్ సోప్‌ను కలిపి ఓ పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని మరకలపై ఆప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగితే మరకలు పోతాయి.
Image credits: Getty
Telugu
ఉప్పు, నీళ్ళు
స్టీల్ పాత్రలకు అంటుకున్న మరకలను ఉప్పు, నీళ్ళతో రుద్ది శుభ్రం చేయవచ్చు.
Image credits: Getty
Telugu
హైడ్రోజన్ పెరాక్సైడ్
పాత్రలపై మరకల్ని తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మరక ఉన్న చోట కొన్ని చుక్కల ఈ ద్రావణాన్ని వేసి పావుగంట నానబెట్టాలి. ఆ తరువాత కడిగేస్తే చాలు.