Woman

మోచేతుల నలుపు పోవాలంటే ఏం చేయాలి?

Image credits: Getty

పెరుగు- ఓట్స్

పెరుగు, ఓట్స్ తో మోచేతుల నలుపును చాలా ఈజీగా పోగొడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ ఓట్స్ ను కలిపి మోచేతులకు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty

పెరుగు- పసుపు

పసుపు, పెరుగు కూడా మోచేతుల నలుపును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ పెరుగును తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి మోచేతులకు మసాజ్ చేయండి.

Image credits: Getty

శనగపిండి- టమాటా

ఒక టీస్పూన్ శెనగపిండిలో రెండు టీస్పూన్ల టమాటా రసాన్ని కలిపి మోచేతులకు పెట్టి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty

కలబంద- తేనె

మోచేతుల, మోకాళ్ల నలుపును పోగొట్టడంలో కలబంద, తేనె బాగా సహాయపడతాయి. ఇందుకోసం అలొవెరా జెల్ ను తేనెను సమానంగా తీసుకుని కలిపి మోచేతులకు రాయండి. 

Image credits: Getty

నిమ్మ- పంచదార

నల్లని మోచేతులను తెల్లగా చేయడంలో నిమ్మకాయ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం సగం నిమ్మకాయ ముక్కను పంచదారలో ముంచి మోచేతులకు రుద్దితే నలుపు తొలగిపోతుంది.

Image credits: Getty

కొబ్బరి నూనె

కొన్ని రకాల నూనెలతో కూడా మోచేతుల నలుపు తొలగిపోతుంది. ఇందుకోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మోచేతులకు రాస్తే సహజ రంగు వస్తుంది. 

Image credits: Getty

బాదం పాలు

బాదం పాలతో కూడా మీరు నల్లని మోచేతులను సహజ రంగులోకి తీసుకురావొచ్చు. ఇందుకోసం పచ్చి పాలలో బాదం పలుకులను నూరి మోచేతులకు పట్టిస్తే నలుపు చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

దీపావళికి లక్ష్మీ పూజకు అదిరిపోయే పైథానీ చీరలు

పెదాలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

పెళ్లైన స్త్రీలు నల్లపూసలే ఎందుకు ధరించాలో తెలుసా?

తక్కువ ఖర్చుతో, అదిరిపోయే బంగారు, ముత్యాల హారాలు