Woman
బంగారు గొలుసుల కంటే రెట్టింపు అందంగా ఉండే బ్లాక్ బీడ్ చైన్ మంగళసూత్రాలు మీ మెడకు చాలా అందంగా ఉంటాయి.
డబుల్ చైన్, ముత్యంపై చేసిన ఈ మంగళసూత్రం ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి లాకెట్ కూడా ఉండటంతో మరింత అందంగా ఉంది. మీరు తేలికైన ఐటమ్ కోరుకుంటే దీన్ని ఎంచుకోండి.
నగల దుకాణంలో మీకు బ్లాక్ బీడ్ చైన్స్ చాలా కనిపిస్తాయి. దీనిలో కావాలంటే మీరు స్టోన్, స్వచ్ఛమైన బంగారు లాకెట్‌ను కూడా కలిపి వేసుకోవచ్చు. మాక్సిమం 6 గ్రాములు ఉంటుందంతే.
ఈ రోజుల్లో బంగారు తీగపై తయారుచేసిన ఆభరణాలను చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు ఉద్యోగినులు అయితే ఆఫీస్ కి వెళ్లడానికి ఈ లేటెస్ట్ బంగారు గొలుసు బాగుంటుంది.
నల్లటి పూసలతో ఉన్న ఈ ఫ్యాన్సీ బంగారు గొలుసు ధరిస్తే మీరు రెట్టింపు అందంగా కనిపిస్తారు. ఇది చీరకైనా, వెస్ట్రన్ డ్రెస్ కైనా చాలా బాగుంటుంది.
ఫోటోలో కనిపిస్తున్న నల్లటి పూసను బంగారు గొలుసు, రాళ్లతో కలిపి తయారు చేశారు. మీకు పొడవుగా, తేలికగా ఉండే గొలుసు ఇష్టమైతే ఇదే బెస్ట్ సెలెక్షన్.