Woman
గుడ్డు హెయిర్ ప్యాక్ జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. మరి గుడ్డులోని తెల్ల సొన మంచిదా? పచ్చ సొన మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుడ్లలో ఎన్నో రకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి.
గుడ్డు పచ్చ సొన కూడా మన జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు, బయోటిన్ జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది.
గుడ్డు పచ్చసొనను తలకు ఉపయోగించడం వల్ల వెంట్రుకలు బలపడతాయి. అలాగే జుట్టు ఫాస్ట్ గా పెరగడం మొదలవుతుంది.
మీకు తెలుసా? గుడ్డు పచ్చసొన హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు తెగిపోకుండా ఉంటాయి. అలాగే చుండ్రు కూడా చాలా వరకు తగిపోకుండా ఉంటుంది.
ఇకపోతే గుడ్డు తెల్లసొనలో కూడా ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ నెత్తిమీద చుండ్రును లేకుండా చేస్తాయి. జుట్టుకు మంచి బలాన్ని ఇస్తాయి.
గుడ్డు తెల్లసొన హెయిర్ ప్యాక్ ను వాడితే మన తల చాలా వరకు శుభ్రం అవుతుంది. దీంతో నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది.
నిపుణుల ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండూ.. జుట్టు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి.కాబట్టి ఈ రెండూ జుట్టుకు ముఖ్యమే.