Woman

ముఖానికి గుడ్డు పెడితే ఏమౌతుంది

Image credits: Getty

మచ్చలు పోతాయి

ముఖంపై ఉన్న మచ్చలు పోవాలంటే గుడ్డు తెల్లసొనను బాగా కలిపి అందులో టీ స్పూనే తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. 

Image credits: Getty

ముడతలు తగ్గడానికి..

ముఖంపై ఉన్న ముడతలు మన వయసును పెంచేస్తాయి. అయితే మీరు గుడ్డు తెల్లసొనను బాగా కలిపి  దానిని ముఖానికి పట్టిస్తే ముడతలు, గుంతలు తగ్గిపోతాయి. 

Image credits: Getty

ముడతల నివారణకు

ఇందుకోసం గుడ్డు తెల్లసొనలో ఒక టీస్పూన్ నారింజ రసం, అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty

చర్మం పొడిబారకుండా

చలికాలంలో చర్మం బాగా డ్రై అవుతుంటుంది. అయితే ఈ సమస్యను పోగొట్టుకోవడానికి గుడ్డు పచ్చసొనలో ఆలివ్ ఆయిల్, తేనె వేసి బాగా కలిపి ముఖానికి పెట్టండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగండి.

Image credits: Getty

నల్ల మచ్చలు పోవడానికి

ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోవడానికి తెల్లసొనలో టీ స్పూన్ నిమ్మరసం, సగం బాదం పప్పు, అర టీస్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. 

Image credits: Getty

కాంతివంతమైన చర్మానికి

మీ ముఖం అందంగా ఉండాలంటే గుడ్డు తెల్లసొనలో ఒక టీస్పూన్ తేనె, పెరుగును వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి పెట్టి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. అయితే ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి.

Image credits: Getty

ముఖానికి టమాటా పెడితే ఏమౌతుందో తెలుసా

చలికాలానికి ది బెస్ట్ చీరలు ఇవే

ఉంగరాల జుట్టు వారికి ది బెస్ట్ హెయిర్ స్టైల్స్

ఇంత అందమా? నయనతార ఏం తింటుందో తెలుసా?