Woman
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల స్కిన్ ట్యాన్ అయిపోతుంది. అంటే నల్లగా మారిపోతారు.
టాన్ చర్మం రంగు మారడమే కాదు, పిగ్మెంటేషన్, స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా పెంచుతుంది.
సన్ టాన్ తగ్గించడానికి ఇంట్లో ట్రై చేయగల ఫేస్ ప్యాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా ఉంచడానికి శనగపిండి బాగా పనిచేస్తుంది. శనగపిండిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు మసాజ్ చేయండి. ఇది సన్ టాన్ తగ్గిస్తుంది.
నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాస్తే నలుపు తగ్గుతుంది.
రెండు స్పూన్ల ఓట్స్ పొడి, కొంచెం పెరుగు కలిపి ప్యాక్ చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడకు రాయండి.
కలబంద జెల్ ముఖానికి, మెడకు రాస్తే సన్ టాన్ తగ్గుతుంది.