ఐస్ క్యూబ్స్ తో కూడా కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట ఐస్ ముక్కలను వాడాలి.
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఐస్ క్యూబ్స్ ను ఒక కాటన్ గుడ్డలో చుట్టండి. దీన్ని కళ్ల చుట్టూ కాసేపు రుద్దండి.
ఐస్ ముక్కలతో డార్క్ సర్కిల్స్ తగ్గిపోవాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు ఇలా చేయాలి.
టమాటా రసాన్ని ఉపయోగించి కూడా మీరు కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. నిజానికి టమాటా రసం ఇందుకోసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
కళ్ల చుట్టూ ఉన్న నలుపు తగ్గాలంటే టమాటా రసాన్ని రసాన్ని కాటన్ తో కళ్ల చుట్టూ రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేసినా డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయి.
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కొబ్బరి నూనె, కలబందలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఈ రెండింటినీ కలిపి కళ్ల చుట్టూ రాయాలి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.