Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?
woman-life Jun 13 2026
Author: Nandini Arava Image Credits:Freepik
Telugu
పీరియడ్స్‌లో పచ్చడి తినొచ్చా?
పిరియడ్స్ లో తినే తిండిపై చాలా అపోహలు ఉంటాయి. ఇది తినొచ్చా, అది తినొచ్చా అనే సందేహం ఉంటుంది. మరి పచ్చళ్ల సంగతి అంటారా? కడుపునొప్పి వస్తుంది కానీ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Image credits: social media
Telugu
సైన్స్ ఏం చెబుతోంది?
పీరియడ్స్ సమయంలో పచ్చడి తినడం వల్ల హాని జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Image credits: Getty
Telugu
అపోహలు, వాస్తవాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. పచ్చళ్ల వంటి కొన్ని ఆహారాలు రుతుస్రావాన్ని ప్రభావితం చేస్తాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు.
Image credits: social media
Telugu
రాగల సమస్యలు
పచ్చళ్లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంతమందిలో కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. మీకు మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే పచ్చళ్లకు దూరంగా ఉండటం మంచిది.
Image credits: freepik
Telugu
వ్యక్తిగత ఇష్టాలు
కొందరికి పీరియడ్ టైమ్‌లో పచ్చడి తినాలనిపిస్తుంది. అయితే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మితంగా తినాలి. మరీ కారంగా ఉంటే నిమ్మరసం వేసుకోండి. కారం బ్యాలెన్స్ అవుతుంది.
Image credits: Freepik
Telugu
పీరియడ్స్‌లో ఏం తినకూడదు?
చక్కెర, ఉప్పు, కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలను పెంచుతాయి.