ఉదయం 5 నిమిషాలు ఇలా చేస్తే మీ ముఖం పార్లర్ గ్లో లాగా మెరిసిపోతుంది
woman-life May 08 2026
Author: Nandini Arava Image Credits:Asianet News
Telugu
ఐస్ రోలర్ ప్రయోజనాలు
వేసవిలో ఫేష్ ఫ్రెష్‍గా ఉంచడం చాలా కష్టం. దురద, మొటిమలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఈ ఐస్ రోలర్లు ట్రై చేయండి. మెరిసిపోవడం గ్యారెంటీ.
Image credits: Asianet News
Telugu
ముఖంపై వాపును తగ్గిస్తుంది
ఉదయం నిద్రలేవగానే ముఖం, కళ్ల కింద వాపు కనిపిస్తుందా? ఐస్ రోలర్‌తో మసాజ్ చేస్తే ఆ వాపు వెంటనే తగ్గిపోతుంది.
Image credits: Getty
Telugu
రక్త ప్రసరణను పెంచుతుంది
చల్లటి రోలర్‌తో ముఖంపై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మానికి సహజమైన మెరుపు, ఫ్రెష్ లుక్ ఇస్తాయి.
Image credits: Asianet News
Telugu
చర్మ రంధ్రాలను మూసివేస్తుంది
చర్మంపై ఐస్ రోలింగ్ చేస్తే రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల స్కిన్ లోపలికి మురికి, చెమట పేరుకుపోకుండా ఉంటుంది.
Image credits: Asianet News
Telugu
ఉత్పత్తులు వేగంగా ఇంకేలా చేస్తుంది
మీరు వాడే సీరమ్ లేదా మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఐస్ రోలర్‌తో మసాజ్ చేయండి. దీనివల్ల ఆ ఉత్పత్తులు చర్మంలోకి వేగంగా ఇంకుతాయి.
Image credits: Asianet News
Telugu
మొటిమలు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది
మొటిమల వల్ల వచ్చే నొప్పి, డ్రైనెస్, ఎరుపుదనాన్ని తగ్గించడంలో ఐస్ రోలర్ బాగా పనిచేస్తుంది. చర్మంపై అసౌకర్యాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
Image credits: Asianet News
Telugu
చర్మానికి సాగే గుణాన్నిస్తుంది
ఐస్ రోలర్‌ను రోజూ వాడితే చర్మం టైట్‌గా మారుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి. దీంతో మీ ముఖం మరింత యవ్వనంగా కనిపిస్తుంది.