Woman

ఈ గిన్నెలను డిష్‌వాషర్‌ లో మాత్రం వేయకూడదు

నాన్ స్టిక్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నాన్ స్టిక్ పాత్రలను వాడుతున్నారు. అయితే వీటిని మాత్రం డిష్ వాషర్ లో వేయకూడదు. ఎందుకంటే డిష్ వాషర్‌లో వాడే వేడినీళ్లు, డిటర్జెంట్ వల్ల వాటి పూత పాడవుతుంది.

రాగి, ఇత్తడి వస్తువులు

డిష్ వాషర్ లో రాగి, ఇత్తడి పాత్రలను కూడా వేయకూడదు. ఎందుకంటే దీనివల్ల వాటి రంగు, మెరుపు పోతాయి. అందుకే వీటిని ఎప్పుడూ కూడా చేత్తోనే కడగాలి. 

చెక్క వస్తువులు

కట్టింగ్ బోర్డులు, చెక్క చెంచాలు వంటి చెక్క వస్తువులను డిష్ వాషర్ మర్చిపోయి కూడా వేయకూడదు. ఎందుకంటే దీనివల్ల అవి ఎండిపోయి పగిలిపోతాయి. వేడినీళ్ల వల్ల చెక్క పాడవుతుంది. 

పింగాణీ వస్తువులు

క్రిస్టల్, పింగాణీ వస్తువులను డిష్ వాషర్ లో వేస్తే అవి పగిలిపోతాయి. కాబట్టి వీటిని చేత్తోనే కడగాలి. 

ఇనుప వస్తువులు

ఇనుప వస్తువులను కూడా డిష్ వాషర్ లో వేయకూడదు. ఎందుకంటే దీనివల్ల అవి బాగా తప్పు పడతాయి. 

మట్టి వస్తువులు

మట్టి పాత్రలు చాలా సున్నితంగా ఉంటాయి. ఏమాత్రం దెబ్బతగిలినా పగిలిపోతాయి. మీరు వీటిని డిష్ వాషర్ లో వేస్తే ఆ ప్రెషర్ కు అవి పగిలిపోతాయి. 

ప్లాస్టిక్ వస్తువులు

ప్లాస్టిక్ బౌల్స్, ప్లేట్లను డిష్ వాషర్ లో వేసారంటే అవి ఆ వేడికి కరిగిపోతాయి. వాటి షేప్ పూర్తిగా పాడవుతుంది. 

వెండి వస్తువులు

డిష్ వాషర్ లో వెండి వస్తువులను కూడా వేయకూడదు. ఎందుకంటే దీనివల్ల వాటి పై పూత పోతుంది. దీంతో అవి పాతవాటిలా కనిపిస్తాయి. 

Find Next One