Woman

తెల్ల జుట్టు వస్తోందా? ఇలా చేస్తే జుట్టు నల్లగా అవుతుంది

Image credits: freepik

ఉసిరి, కొబ్బరి నూనె

ఉసిరి మన జుట్టును నల్లగా మార్చడానికి బాగా సహాయపడుతుంది. ఉసిరిని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే  తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

కరివేపాకు, కొబ్బరి నూనె

కరివేపాకులోని పదార్థాలు జుట్టుకు నల్లగా మారుస్తాయి. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి చల్లారనివ్వండి. ఈ నూనెను జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. రెం


 

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం తెల్లజుట్టును నల్లగా మార్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉల్లిపాయను తురిమి రసాన్ని తీసి జుట్టుకు పట్టించి 30-45 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయండి.

మెహందీ, కాఫీ మిశ్రమం

మెహందీ, కాఫీ పేస్ట్ కూడా జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. మెహందీలో కాఫీ, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. 2-3 గంటల తర్వాత కడిగేయండి.

నువ్వులు, అవిసె గింజలు

నల్ల నువ్వులు, అవిసె గింజలను కలిపి పొడి చేసి, పేస్ట్‌లా చేయండి. దీన్ని జుట్టుకు పట్టించి కడిగేయండి. ఇది జుట్టును నల్లగా మార్చడమే కాకుండా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

టీ నీళ్లు

టీ నీళ్లు కూడా జుట్టును నల్లగా మార్చుతాయి. నీటిలో టీ పౌడర్ వేసి మరిగించి, చల్లార్చి, జుట్టుకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయండి. ఇది జుట్టుకు సహజ రంగును అందిస్తుంది.

కరివేపాకు, పెరుగు

కరివేపాకును పేస్ట్‌లా చేసి, పెరుగులో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30-40 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి. ఇది జుట్టును నల్లగా మార్చుతుంది. 

బంగాళదుంప తొక్కల నీరు

బంగాళదుంప తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని జుట్టుకు పట్టించండి. ఇది క్రమంగా మీ జుట్టును నల్లగా మార్చి, సహజ రంగును అందిస్తుంది.

వీళ్లు జుట్టుకు గుడ్డు పెట్టకూడదు

పీరియడ్స్ ముందు ఆ సమస్య.. ఎందుకు

అరటి తొక్కను ముఖానికి రుద్దితే ఏమౌతుందో తెలుసా

వెండి పట్టీలు, మెట్టెలు కొత్తవాటిలా కనిపించాలంటే ఇలా చేయండి