Telangana
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన రైతు బి. మహిపాల్ రెడ్డి తక్కువ వర్షపాతం వల్ల వరి సాగు లాభదాయకం కాకపోవడంతో టమాటా సాగుకు మారారు.
మహిపాల్ రెడ్డి సాగు పద్ధతులపై మంచి అవగాహన కలిగివున్నాడు. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు ఆదర్శంగా నిలిచారు.
టమాటా సాగు పద్ధతులను నేర్చుకోవడానికి మహిపాల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు, ఇది తెలంగాణలో టమాటా సాగుకు సహాయపడింది.
ఏప్రిల్, మే నెలలు టమాటా సాగుకు అనుకూలం. కానీ ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంట దెబ్బతింటుంది. కానీ తన 8 ఎకరాల భూమిలో రూ.16 లక్షలతో నెట్ షేడ్స్ ఏర్పాటుచేసుకున్నాడు మహిపాల్.
అయితే టమాటా మార్కెట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.200 వున్న సమయంలో మహిపాల్ పంట చేతికివచ్చింది. దీంతో కేవలం 15 రోజుల్లోనే రూ.2 కోట్ల విలువైన టమాటాలు అమ్ముడుపోయాయి.
రెడ్డి 15 రోజుల వ్యవధిలో 7,000 పెట్టెల టమాటాలను (ఒక్కో పెట్టెలో 25-28 కిలోలు) అమ్మారు. ఆ సమయంలో టమాటాకు వున్న అధిక డిమాండ్‌ను ఉపయోగించుకున్నారు.
60 ఎకరాల్లో టమాటాలు, మిగిలిన భూమిలో ఇతర పంటలు సాగు చేస్తూ బిందు సేద్యం, స్టాకింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు తెలంగాాణ రైతన్న మహిపాల్ రెడ్డి.