Telangana

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా వున్నాయో తెలుసా?

Image credits: Getty

ఇటీవల ఉల్లి, టమాటాకు రెక్కలు

ఇటీవల వంటల్లో ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు చాలా పెరిగిపోయాయి. కిలో 100 రూపాయల వరకూ అమ్ముడయ్యాయి
 

Image credits: Getty

పోటీపడి పెరిగిన ధరలు

భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని సరఫరా తగ్గడంతో ఉల్లి ధర సెంచరీ దాటింది. ఇదే సమయంలో టమాటా కూడా 50,60,70, 80... ఇలా ధర పెరుగుతూపోయి వంద రూపాయలు దాటింది. 

Image credits: social media

సామాన్య కుటుంబాలపై ధరల భారం

నిత్యం వంటల్లో ఉపయోగించే టమాటా, ఉల్లి ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాల్లో ఖర్చులు పెరిగిపోయాయి. కిలో టమాటా కొనాలంటే కన్నీరు పెట్టాల్సి వచ్చింది. దీంతో వీటిని తక్కువగా వాడుకున్నారు.

 

 

Image credits: Freepik

ధరలు తగ్గాయి

అయితే ప్రస్తుతం హైదరాబాద్ కు ఉల్లి సరఫరా పెరగడంతో ధర కాస్త తగ్గింది. మంచి ఉల్లిపాయలు కూడా మార్కెట్‌కి వచ్చింది

Image credits: Getty

ప్రస్తుతం హైదరాబాద్ లో టమాటా ధర?

ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా కేవలం 20 రూపాయలకే లభిస్తోంది. గతంలో రూ.100 కు కిలో వస్తే ప్రస్తుతం నాలుగైదు కిలోలు వస్తున్నాయి.   


 

Image credits: Getty

ఉల్లి ధర ఎంత?

ఇక కిలో ఉల్లిపాయలు 20-30 రూపాయలకే దొరుకుతున్నాయి. అక్కడక్కడ రూ.100 మూడు నాలుగు కిలోలు కూడా దొరుకుతున్నాయి.  

Image credits: social media