Telangana

ఏపీ, తెలంగాణ యువతకు లక్కీ ఛాన్స్ : SBI బ్యాంకులో 13,735 ఉద్యోగాలు

Image credits: FREEPIK

బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ

Banking Jobs : మీరు బ్యాకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇది మీకు లక్కీ ఛాన్స్. తాజాగా బ్యాంకులు భారీ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. 
 

Image credits: iSTOCK

SBI లో 13,735 ఉద్యోగాాల భర్తీ

తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఏకంగా 13,735 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 
 

Image credits: Social media

ఏ పోస్టుల భర్తీ?

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్బిఐ బ్యాంక్ లో జూనియర్ అసోసియేట్(JA) ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.  
 

Image credits: freepik

రిజిస్ట్రేషన్ షురూ... లాస్ట్ డేట్ ఎప్పుడంటే...

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ మంగళవారం(డిసెంబర్ 17) నుండి ప్రారంభం అవుతోంది. జనవరి 7,2025 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 
 

Image credits: Getty

రిజిస్ట్రేషన్ ఫీజు

జనరల్, ఓబిసి, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఇక ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు వుండదు. 
 

Image credits: iSTOCK

రాత పరీక్ష ఎప్పుడు?

అభ్యర్థులకు పిబ్రవరి 2025 లో ప్రిలిమ్స్, మార్చ్ లేదా ఏప్రిల్, 2025  మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం వుంది. 
 

Image credits: Getty

విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ,విద్యాసంస్థల నుండి డిగ్రీ పూర్తిచేసి వుండాలి. 
 

Image credits: Getty

డిగ్రీ చదివేవారు అర్హులే...

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 31, 2025 నాటికి డిగ్రీ పూర్తిచేసి వుండాలి. 
 

Image credits: Getty

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాలెన్ని?

ఆంధ్ర ప్రదేశ్ లో అంటే అమరావతి సర్కిల్ లో మొత్తం 50 (ఎస్సి 8, ఎస్టి 3, ఓబిసి 13, ఈడబ్యూఎస్ 5, జనరల్ 21) పోస్టులు వున్నాయి. 
 

Image credits: Getty

తెలంగాణలో ఉద్యోగాలెన్ని?

తెలంగాణలో అంటే హైదరాబాద్ సర్కిల్ లో 342 (ఎస్సి 54, ఎస్టి 23 , ఓబిసి 92, ఈడబ్యూఎస్ 34, జనరల్ 139) పోస్టులు వున్నాయి. 
 

Image credits: Getty

అత్యధికంగా ఈ రాష్ట్రాల్లో ఖాళీలు

అత్యధికంగా గుజరాత్ 1073, మధ్య ప్రదేశ్ 1317, పశ్చిమ బెంగాల్ 1254, ఉత్తర ప్రదేశ్ 1894, మహారాష్ట్ర 1163, బిహార్ 1111 పోస్టులు వున్నాయి. 
 

Image credits: iSTOCK

సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి

ఈ SBI క్లర్క్ రిక్రూట్ మెంట్ 2024 రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను పరిశీలించండి. 
 

Image credits: Getty

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా వున్నాయో తెలుసా?