మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?
Telugu
మరణం తర్వాత ఏమౌతుంది?
మరణం తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఆత్మ తన శరీరంలోకి మళ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తుందట. అలా వీలుకానప్పుడు ఆత్మ ఏం చేస్తుంది?
Telugu
యమలోకం నుంచి భూమిపైకి
గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ మొదట యమరాజు వద్దకు వెళుతుంది. అక్కడి నుండి అది మళ్ళీ భూమికి వస్తుంది. అంటే కొద్ది సమయంలోనే ఆత్మ యమలోకం నుండి తిరిగి తన ఇంటికి వస్తుంది.
Telugu
శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది
ఇక్కడ తన మృతదేహాన్ని చూసినప్పుడు, దానిలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది సాధ్యం కాదు. తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యం చూసి బాధపడుతుంది.
Telugu
కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి వస్తుంది
ఆ శరీరం దహనం అయ్యే వరకు, దానిపై ఆత్మకు మమకారం ఉంటుంది. దహన సంస్కారం తర్వాత ఆత్మ కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి వస్తుంది, కానీ ఏమీ మాట్లాడలేదు.
Telugu
13 రోజులు ఇంట్లోనే ఉంటుంది
కుటుంబ సభ్యులు 13 రోజుల పాటు చేసే దానధర్మాలు, పిండ ప్రదానం మొదలైన వాటినే ఆత్మ ఆహారంగా తీసుకుంటుంది. ఈ సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యం చూసి బాధపడుతుంది.
Telugu
47 రోజుల్లో యమలోకానికి చేరుకుంటుంది
13 రోజుల తర్వాత, మృతుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, ఆత్మ ఒంటరిగా యమలోకం వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం, యమలోకానికి చేరుకోవడానికి ఆత్మకు 47 రోజులు పడుతుంది.