Telugu

వీళ్లు మాత్రం వారికి వారే పిండం పెట్టుకుంటారు

Telugu

నాగ సాధువులుగా దీక్ష

పరమేశ్వరుడి అనుగ్రహం కోసం సాధకులు మహా కుంభ మేళాలో నాగ సాధువులుగా దీక్ష తీసుకుంటారట. ప్రయాగరాజ్‌లో ప్రస్తుతం వేలాది మంది నాగా సాధువులుగా దీక్ష తీసుకోవడం కనిపిస్తోంది. 

Telugu

స్వయంగా పిండప్రదానం ఎందుకు

నాగా సాధువులు బతికే ఉన్నా తమ కుటుంబం, సమాజం కోసం చనిపోయామని నమ్ముతారట. కుటుంబ బంధాల నుండి విముక్తి పొందడానికే వారికి వారే పిండ ప్రదానం చేసుకుంటారు.

Telugu

అసలు ఎవరికి పిండ ప్రదానం చేస్తారు?

హిందూ మతంలో మరణించిన వ్యక్తికి పిండ ప్రదానం చేస్తారు. పిండ ప్రదానం చేయడం వల్ల మృతుడి ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

 

Telugu

పిండ ప్రదానం ఎలా చేస్తారు?

నాగ సాధువులుగా మారే వ్యక్తి 17 పిండ ప్రదానాలు చేస్తారు. 16 వారి పూర్వుకులకు, 17వది వారికే పిండ ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందుతారు. 

Telugu

సనాతన ధర్మ రక్షకులుగా

నాగ సాధువులను సనాతన ధర్మ రక్షకులు అంటారు. అంటే వారు ఎల్లప్పుడూ ధర్మాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయుధాలు కూడా వాడతారు. 

Telugu

ప్రయాగలో రాజరాజేశ్వర నాగాలు

ప్రయాగలో దీక్ష తీసుకునే సాధకులను రాజరాజేశ్వరులు అంటారు. నాగాగా మారిన తర్వాత గురువు వారి చెవిలో ఒక మంత్రాన్ని చెబుతారు. దానిని వారు జీవితాంతం జపిస్తారు.

మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

సాధువులు ధరించే కాషాయ వస్త్రాల వెనుక అంత విషయం ఉందా?

ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం

చాణక్య నీతి: ఈ 4 పనులను మధ్యలో వదిలేయకూడదు