శ్రావణ మాసంలో ఈశాన్య దిక్కున దీపం వెలిగించడం చాలా మంచిది. దీని వల్ల శివుడి అనుగ్రహం లభిస్సతుంది. పితృ దోషం కూడా పోతుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మీరు ఉదయం-సాయంత్రం వేళల్లో చతుర్ముఖ దీపం వెలిగించవచ్చు. దీనివల్ల ఇంట్లోని చెడు శక్తి తొలగిపోతుంది. ఈ పరిహారాన్ని మీరు శ్రావణ సోమవారం రోజున తప్పకుండా చేయండి.
వంటగదిలో కూడా దీపం వెలిగించడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. అలా చేసేవారి దగ్గర డబ్బు కొరత ఉండదు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
శ్రావణ మాసంలో ప్రతిరోజూ సాయంత్రం శివుడి ముందు పంచముఖ దీపం తప్పకుండా వెలిగించండి. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కెరీర్‌లో ఆటంకాలు కూడా రావు.