శివాలయానికి వెళ్లే ముందు.. శివ ప్రదక్షణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి.
శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు. శివాలయంలోని ధ్వజ స్తంభం (నందీశ్వరుడు) దగ్గర నుంచి ఎడమ పక్కగా సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి.
ప్రదక్షిణ సమయంలో సోమసూత్రం దాటకూడదు. మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సోమసూత్రం అంటే గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన జలం బయటికి వెళ్లే దారి
లింగ పురాణం ప్రకారం సోమసూత్రాన్ని దాటడం వల్ల ప్రదక్షిణ చేసిన ఎలాంటి ఫలితం లభించదు. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒక క్షణం ఆగి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్లాలి. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి
శివాలయంలో ప్రదక్షణలు చేసే సమయంలో సోమసూత్రాన్ని అసలు దాటకూడదు. ఎందుకంటే.. అభిషేక జలం పడే చోట ప్రమద గణాలు కొలువై ఉంటాయని వారిని దాటితే పాపం చేసినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి.
సోమసూత్రంలో శక్తి ఉంటుంది, దాన్ని దాటినప్పుడు కాళ్ళు విస్తరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని నమ్మకం.
లింగ పురాణం ప్రకారం శివాలయంలో ఒక్క సోమసూత్ర ప్రదక్షణ చేస్తే పదివేల ప్రదక్షిణాలతో సమానంగా భావిస్తారు. మీ శక్తిని అనుసారం ఈ విధంగా ప్రదక్షిణలు చేయవచ్చు.
శివలింగ ప్రదక్షిణ ఎల్లప్పుడూ ఎడమ వైపు నుండి ప్రారంభించి సోమసూత్రం వరకు వెళ్ళాలి. ప్రదక్షిణలు ఎప్పుడు బేసి సంఖ్యలో చేయాలి. అంటే.. 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణలు అయిన చేయవచ్చు.