Spiritual

రూ.200 కోట్లతో నిర్మించిన భారీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుందో తెలుసా?

10- రాధా మదన్ మోహన్ ఆలయం, హైదరాబాద్

నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఈ ఇస్కాన్ ఆలయం ఉంది. జన్మాష్టమి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయం కూడా ఇదే.

9- రాధా బృందావన్ చంద్ర ఆలయం, పూణే

రాధా బృందావన్ చంద్ర ఆలయంలో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా వైభవంగా చేస్తారు. అర్ధరాత్రి వేళ నిర్వహించే వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 

8- శ్రీ రాధా రసబిహారీ ఆలయం, ముంబై

ఈ ఇస్కాన్ ఆలయం జుహు బీచ్ దగ్గరలో ఉంది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవతామూర్తుల పూల అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది.

7- రాధా కృష్ణ ఇస్కాన్ ఆలయం, చెన్నై

దక్షిణ చెన్నైలో ఈ ఇస్కాన్ ఆలయం ఉంది. 1.5 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోనే అతిపెద్ద రాధా కృష్ణ ఆలయం. ఏప్రిల్ 2012లో దీన్ని కట్టారు. 

6- రాధికారమణ ఇస్కాన్ ఆలయం, ఢిల్లీ

తూర్పు కైలాష్ నగర్‌లో ఉన్న ఈ ఆలయానికి జన్మాష్టమి రోజున 5 నుండి 7 లక్షల మంది వస్తారు. ఇక్కడ అందమైన ఆర్ట్ గ్యాలరీ ఉంది. శ్రీకృష్ణుడికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.

5- కృష్ణ బలరాం ఆలయం, బృందావన్

బృందావన్ లోని భక్తివేదాంత స్వామి మార్గ్‌లో ఉన్న ఈ ఇస్కాన్ ఆలయం 1975లో నిర్మితమైంది. ప్రతి సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు.

4- హరే కృష్ణ ఆలయం, అహ్మదాబాద్

గాంధీనగర్ హైవేపై ఉన్న ఈ ఆలయంలో 'హరే రామ హరే కృష్ణ' అనే మంత్రం ఎప్పుడూ వినిపిస్తుంది. ప్రజల జీవితాలను ఆధ్యాత్మికంగా మెరుగుపరచడానికి ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

3- శ్రీ రాధా కృష్ణ ఆలయం, బెంగళూరు

రాజాజీ నగర్‌లో ఉన్న ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం జన్మాష్టమి నాడు రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు.

2- శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్ ఆలయం, నవి ముంబై

ఖార్ఘర్‌లో ఉన్న ఈ ఆలయాన్నే 200 కోట్లతో నిర్మించారు. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఆలయం. జనవరి 15న ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

1- శ్రీ మాయాపూర్ చంద్రోదయ ఆలయం, పశ్చిమ బెంగాల్

భారతదేశంలోనే అతిపెద్ద ఇస్కాన్ ఆలయం ఇది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఉంది. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయానికి 1972లో శంకుస్థాపన జరిగింది.

మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి

నాగ సాధువుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారా?

ఈ ప్లేట్లల్లో అస్సలు తినొద్దు

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లను మాత్రం ఇంటికి పిలవకూడదు