Spiritual

ఉల్లి, వెల్లుల్లి తినడం పాపమా? శాస్త్రం ఏం చెబుతోంది

ప్రేమానంద్ మహారాజ్

సాధువు, ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ తన ప్రవచనాలతో లక్షలాది మంది జీవితాలను మార్చారు. వివాహ జీవితాన్ని ఎలా సరళంగా ఉంచుకోవాలో ఆయన విలువైన విషయాలు చెబుతారు.

వెల్లుల్లి, ఉల్లి ఎందుకు తినరు?

లక్షలాది మంది భక్తులు వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానేశారు. వాటిని తినడం పాపమని వారు నమ్ముతారు. దీనిపై ప్రేమానంద్ వివరణ ఇచ్చారు.

వెల్లుల్లి, ఉల్లి తినడంలో తప్పులేదు

బంగాళాదుంపలు పండే నేలలోనే ఉల్లి, వెల్లుల్లి పెరుగుతాయని ప్రేమానంద్ మహారాజ్ తెలిపారు. మరి వాటిని తినడం ఎలా చెడ్డది అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు? 

సాధువులు మాత్రమే తినకూడదు

ఉల్లిపాయలు, వెల్లుల్లిలో తామసిక గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల సాధువులు, పూజారులు వాటిని తినరని  ప్రేమానంద్ చెప్పారు. ఎందుకంటే వారు ఆచారాలు పాటించాలి. భగవంతుడికి సేవ చేయాలి. 

శరీరం, మనస్సుపై ప్రభావం

వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో ఉద్రేకం పెరుగుతుంది. మనస్సులో అశాంతి కూడా కలుగుతుంది. అందువల్ల ధ్యానం చేసేవారు, సాధువులు, పూజారులు వాటిని తినరు.

వివాహ జీవితంలో నిషేధం లేదు

వెల్లుల్లి, ఉల్లిపాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల వివాహ జీవితం గడిపేవారు వీటిని తినొచ్చు. ఇందులో ఎలాంటి దోషాలు లేవు. 

డాక్టర్స్ ఏం చెబుతారు

శాస్త్రీయ పరంగా వెల్లుల్లి & ఉల్లిపాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరం. అవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడతాయి. 

పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?

కురుక్షేత్రంలో ధర్మరాజు చంపిన మామ ఎవరో తెలుసా?

తలుపులపై దేవుని రూపాలు ఉండటం దోషమా?

పూజ గదిలో ఏ రంగు వాడకూడదు..?