తనకు జీవితంలో సుఖాలు ఉన్న సమయంలోనే కాదు, కష్టాలు ఉన్నప్పుడు కూడా తోడు ఉండే భార్యను కోరుకుంటారు. జీవితంలో ఎదిగేందుకు తనను ప్రతి విషయంలో ప్రోత్సహించే భార్య కావాలని కోరుకుంటాడు
సంతృప్తి..
భర్త మీద ఆధారపడకుండా, తాను సంతోషంగా ఉంటూ.. భర్తను కూడా సంతోషంగా ఉంచే భార్య, అదేవిధంగా ఉన్న దాంట్లో సంతృప్తి చెందే భార్య కావాలని కోరుకుంటాడట.
శాంత, వివేకవంతురాలైన భార్య
ఒత్తిడి సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండే, చిన్న చిన్న విషయాలకు కోపగించుకోకుండా, పరిస్థితిని వివేకంతో చక్కదిద్దే భార్యను ప్రతి భర్త కోరుకుంటాడు.
గౌరవించే భార్య
గౌరవం ఏ సంబంధానికైనా ప్రధానమైన పునాది. భర్త ఆలోచనలు, నిర్ణయాలను గౌరవించే గుణం భార్యలో ఉండాలని కోరుకుంటాడు.
దయగల భార్య
దయ, సానుభూతి సంబంధాలకు పునాది అని చాణక్య చెప్పారు. కష్టకాలంలో తోడుగా నిలిచే భార్య ప్రతి భర్త కల.
భర్తకూ వర్తించే నియమాలు
భర్త భార్యలో ఈ గుణాలు కోరుకుంటే, భార్య కూడా భర్తలో ఇవే గుణాలు కోరుకుంటుంది. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలిస్తేనే సంబంధం విజయవంతమవుతుంది.