Relations
సాధారణంగా పురుషులు స్త్రీలతో పోల్చినంతా తమ భావాలను వ్యక్తీకరించలేదు. అందుకే స్త్రీలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని తమ భార్త ఫీల్సింగ్స్ ను అర్థంచేసుకోవాలి. భర్తలు కోరుకునేది కూడా ఇదే.
ఏ భర్త అయినా తన భార్య నుంచి గౌరవాన్ని కోరుకుంటాడు. సమాజంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇంట్లో తన గౌరవానికి భంగం కలగకూడదని ఆశిస్తుంటాడు.
భార్తలు తాము చేసే పనులకు భార్యల నుంచి ప్రశంసలను ఆశిస్తుంటారు. చిన్న చిన్న పనులైనా సరే భాగస్వామి ప్రోత్సహిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
తన భావాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాడు. అవసరమైన సమయాల్లో ఓదార్పును కూడా కోరుకుంటారు.
జీవితం చివరి నిమిషం వరకు తోడుండే ఒకే ఒక బంధం ఆలుమగలు, కాబట్టి తన భార్య తనకు ఎప్పుడూ అండగా నిలవాలని ప్రతీ భర్త కోరుకుంటాడు.
కష్టమైనా, సంతోషమైనా తన భావాలను భార్యతో పంచుకోవాలని భర్త కోరుకుంటాడు. అయితే వాటిని స్వీకరించేందుకు భార్య సిద్దంగా ఉండాలి.
భార్య తన సంతోషకరమైన క్షణాలను తనతో కచ్చితంగా షేర్ చేసుకోవాలని భర్త కోరుకుంటాడు. భార్యకు తానే ముఖ్యమనే ఫీలింగ్ లో ఉంటాడు.