హిందూ ధర్మంలో.. భార్యాభర్తల గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే భార్యలేకుండా భర్త కొన్ని పనులు చేస్తే వాటి ఫలితం లభించదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పూజలు, ధార్మిక కార్యక్రమాలు
ధర్మ గ్రంథాల ప్రకారం.. ధార్మిక కార్యక్రమాలు, పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా భార్యభర్తలిద్దరూ ఉండాలి. భర్త ఒక్కడే ఈ పనులు చేయకూడదు. ఒకవేళ చేసినా ఫలితం ఉండదు.
తీర్థయాత్రలు
హిందూ ధర్మం ప్రకారం.. ఏ భర్త అయినా సరే భార్యను తీసుకెళ్లకుండా తీర్థయాత్రలకు వెళ్లకూడదు. ఒకవేళ వెళితే తీర్థయాత్రలు చేసిన పుణ్యం కూడా దక్కదు.
దానధర్మాలు
భర్తే దానధర్మాలు చేసినా.. భార్య ఖచ్చితంగా పక్కన ఉండాలి. ధర్మ గ్రంథాల ప్రకారం..దానం చేసేటప్పుడు భర్త పక్కన భార్య కూడా ఉండాలి.
ఇతర శుభకార్యాలు
భర్త ఏ శుభకార్యం చేసినా లేదా కొత్త పనిని ప్రారంభించినా పక్కనే భార్య ఉండాలి. భార్య ఉంటేనే భర్తకు అన్ని విధాలా లాభం చేకూరుతుందని నమ్ముతారు.