Relations
ప్రేమలో ఉన్నా, పెళ్లైనా ఆడవాళ్లు తమ భర్తలకు తెలియకుండా కొన్ని విషయాలను దాచిపెడతారు. అసలు వీటిని చెప్పడానికే వెనకాడుతారు. అవేంటంటే?
భార్యలు భర్తలకు తమ గత సంబంధాల గురించి చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి వీటివల్ల భర్త తమను తప్పుడుగా అర్థం చేసుకుంటాడని, రిలేషన్ షిప్ దెబ్బతింటుందని భయపడతారు.
ఆడవారు ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే భర్తకు తెలియకుండా కొంత డబ్బును దాచిపెడతారు. ఇవి కష్టసమయాల్లో ఆదుకుంటాయని వారి నమ్మకం.
పుట్టింటి విషయాల గురించి భర్తకు అస్సలు తెలియనీయరు భార్యలు. ఎందుకంటే పుట్టింటి గురించి భర్త చెడుగా మాట్లాడతారని అనుకుంటారు.
ఆడవారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వారి బాగోగుల గురించి పట్టించుకుంటారు. కానీ వారి ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోరు. ఈ విషయం గురించి భర్తలే భార్యను డైరెక్ట్ గా అడగాలి.
ఆడవారు కూడా తమలో ఉన్న భావాలను అస్సలు పట్టించుకోరు. దీనివల్ల ప్రేమ తగ్గుతుందని అనుకుంటారు. అందులోనూ భర్త ఏమనుకుంటారో అని అనుకుంటారు.
కొంతమంది భార్యలు తమ భర్తలతో భద్రత లేదని అనుకుంటారు. ఈ విషయాన్ని భర్త తప్పుగా అనుకుంటారని చెప్పరు. అందుకే ఈ విషయంపై ఇద్దరూ మాట్లాడుకోవాలి.