Relations

20, 30, 40 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే ఏమౌతుందో తెలుసా

పెళ్లికి మ్యాజికల్ ఏజ్ ఏది?

పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఏ వయసులో చేసుకోవాలి? అని నిర్ణయించుకోవడం ఒక వ్యక్తి భావోద్వేగాలు, ఆర్థిక, మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. 

మీరు పెళ్లికి సిద్ధమా?

మీరు ప్రేమలో ఉన్నా.. పెళ్లికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది చాలా ముఖ్యం. పెళ్లి చేసుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. 

పెళ్లి

పెళ్లి అంటే మూడు ముళ్లు మాత్రమే కాదు ఒకరి లక్ష్యాలనొకరు అర్థం చేసుకవోాలి. కలిసి మెలిసి ఉండాలి. భవిష్యత్తు గురించి ప్రణాళిక చేసుకోవాలి. వీటికి అంగీకరిస్తేనే పెళ్లికి రెడీ అవ్వాలి.

20 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే కలిగే లాభాలు

20 ఏండ్లలో పెళ్లి చేసుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ వయసు జంట జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు. ఇది వీరి బంధాన్ని బలంగా చేస్తుంది.

20 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే నష్టాలు

లాభాలు ఉన్నప్పటికీ.. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే.. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు, కెరీర్, గుర్తింపుపై ప్రభావం పడుతుంది. దీంతో ఇద్దరికీ ఒత్తిడి పెరుగుతుంది.

30 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటే లాభాలు

ఈ వయసు వారు విడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే వీళ్లు ఆర్థికంగా స్థిరపడి ఉంటారు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి. దీంతో జంటలకు ఒత్తిడి తగ్గుతుంది. 

30 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే నష్టాలు

ఈ వయసు వారు తమ అలవాట్లను అస్సలు మార్చుకోరు. అందుకే వీళ్లు కొత్తదాన్ని స్వీకరించలేరు. రాజీ పడలేరు. పిల్లల్ని కనడంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. 

40 ఏండ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే లాభాలు

40 ఏండ్ల వయసులో పెళ్లి చేసుకుంటే ఒకరి నుంచి ఒకరు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. వీరు ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు. బంధం కూడా బలంగా ఉంటుంది. 

40 ఏండ్లలో పెళ్లి చేసుకుంటే నష్టాలు

40 ఏండ్లలో పెళ్లి చేసుకున్న జంటల అలవాట్లు, జీవనశైలి స్థిరంగా ఉంటాయి.కాబట్టి వీళ్లు మార్పును స్వీకరించరు. అలాగే పిల్లల్ని కనడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

విడాకులు తీసుకోవడంలో ఈ స్టేట్ టాప్, మరి తెలంగాణ ప్లేస్ ఎంత?

భార్య మందు భర్త అస్సలు అనకూడని విషయాలు ఇవే

2-2-2 రూల్ తో భార్యాభర్తలు మళ్లీ ప్రేమలో పడతారు తెలుసా

బ్రేకప్ బాధిస్తోందా? ఇలా చేస్తే మీరు రీఫ్రెష్ అవుతారు