మీరు జాంబీ పేరెంటా? మీ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందో తెలుసా?
pregnancy-parenting Jan 12 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
వీడియో
పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించకుండా, వీడియో తీయడంపైనే దృష్టి పెట్టడం పిల్లలతో బంధాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ తో మాత్రమే ఎక్కువ సమయం గడపడమే జాంబీ పేరెంటింగ్
Image credits: Getty
Telugu
భోజన సమయంలో
కుటుంబ సభ్యులు కలిసే భోజన సమయంలో కూడా పేరెంట్స్ ఫోన్ చూడటం పిల్లలతో బంధాన్ని బలపరిచే అవకాశాన్ని దూరం చేస్తుంది.
Image credits: Getty
Telugu
సగం శ్రద్ధ
పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూస్తూ సమాధానం ఇవ్వడం వల్ల వాళ్లు నిర్లక్ష్యానికి గురైనట్టు, ఒంటరిగా ఫీల్ అవుతారు.
Image credits: Getty
Telugu
స్కూల్ నుండి వచ్చాక
స్కూల్ నుండి వచ్చే పిల్లలను నవ్వుతూ పలకరించకుండా ఫోన్ చూడటం పిల్లలను నిరాశకు గురి చేస్తుంది.
Image credits: Getty
Telugu
నడిచేటప్పుడు కూడా
పిల్లలతో కలిసి నడుస్తున్నప్పుడు ఫోన్‌పై దృష్టి పెట్టడం వారితో మాట్లాడే, కలిసే అవకాశాన్ని దూరం చేస్తుంది.
Image credits: Getty
Telugu
'బేబీ సిట్టర్'
పిల్లలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వారికి ఫోన్ లేదా ట్యాబ్ ఇవ్వడం వారి మానసిక, సామాజిక ఎదుగుదలకు హానికరం.
Image credits: Getty
Telugu
సోషల్ మీడియా
పిల్లలతో సంతోషంగా ఉండటం కన్నా, తాము సంతోషంగా ఉన్నామని ఇతరులకు చూపించడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపైనే ఇలాంటి తల్లిదండ్రులు దృష్టి పెడతారు.
Image credits: Getty
Telugu
ఫోన్‌కే ప్రాధాన్యత
పిల్లలు సహాయం కోసం వచ్చినప్పుడు ఫోన్‌లో ఉన్నారని వారిని పక్కన పెట్టడం వారిలో కోపం, బాధను కలిగిస్తుంది.
Image credits: Getty
Telugu
చెడుగా ప్రభావితం చేస్తుంది
ఇలాంటి ప్రవర్తన పిల్లల భావోద్వేగ ఎదుగుదలను, తల్లిదండ్రులతో వారి బంధాన్ని చెడుగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు.