pregnancy & parenting
మీ పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఫీలవుతారు. కాబట్టి వారి కోపానికి గల కారణం అడగండి.
మీ పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా కోపపడకుండా, పిల్లల సమస్యకు గల కారణాన్ని అడిగి శాంతపరచవచ్చు.
పిల్లల సమస్యను అడిగిన తర్వాత మీరు వారిని చూసి ఎప్పుడూ తప్పు పట్టడం మొదలు పెట్టకండి. దీనివల్ల వారు బాధపడతారు.
పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వారిని ఎప్పుడూ ఒంటరిగా వదలకండి. దగ్గర ఉండి వారిని శాంతపరచండి.
మీ పిల్లలకు ఒక మంచి స్నేహితుడిగా ఉండి వారి మాటలను అర్థం చేసుకుని పరిష్కారం ఇవ్వండి.
మీ పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ వారిని చూసి నవ్వకండి. ఇది వారికి మరింత బాధ కలిగిస్తుంది.