టమాటాలో ఉండే విటమిన్ సి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు ఒక చిన్న పండిన టమాటా తినడానికి ఇవ్వండి.
ఆకుకూరల్లో ఇనుము, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పిల్లల ఆహారంలో ఆకుకూరలు తప్పకుండా ఉండేలా చూడండి. వారానికి నాలుగు సార్లయినా ఆకుకూరలు పెట్టాలి.
క్యారెట్‌లో ఉండే పోషకాలు పిల్లల కంటి చూపు, చర్మ ఆరోగ్యం, మెదడు అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిది. దీన్ని పచ్చిగా తిన్నా ఆరోగ్యమే. పిల్లలు ఇలా తినలేకపోతే జ్యూస్ చేసి ఇవ్వండి.
చిలగడదుంప పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు లేదా ఉడికించి పెట్టండి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ముల్లంగిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి శరీరం నుండి ప్రమాదకర పదార్థాలను తొలగించడానికి, చెడు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
పిల్లలకు వారి ఇష్టానుసారం కాలీఫ్లవర్‌ను ఉడికించి ఇవ్వండి. వారు దానిని ఇష్టంగా తింటారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
పెసలు, వేరుశెనగ, బఠానీ వంటివి నానబెట్టి, మొలకెత్తిన తర్వాత పిల్లలకు పెట్టండి. అప్పుడే పూర్తి పోషకాలు లభిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది.