NATIONAL
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో సోమవారం ఉదయం 8 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు.
ఈ ఘోర ప్రమాదం అల్మోరాలోని కూపీ వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. 14 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎక్కువ మంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
నైనీడాండాలోని కినాథ్ నుండి రామ్‌నగర్‌కు వెళుతున్న బస్సు అతివేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిపోయిందని అల్మోరా ఎస్పీ తెలిపారు.
లోయలో పడకముందే బస్సు ఒక చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చాలామంది ప్రయాణికులు కిటికీల నుండి బయటకు విసిరిపడ్డారు.