పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం కింద డబ్బులు జమ చేశారు. అయితే, అర్హులైనా ఖాతాలో డబ్బులు జమ కాకపోతే చింతించాల్సిన అవసరం లేదు.
Telugu
రైతులకు ఏడాదికి 6 వేలు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా రైతులకు 6 వేల రూపాయలు అందిస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2-2 వేల చొప్పున విడతల వారీగా జమ చేస్తారు.
Telugu
PM Kisanలో ఎంతమంది రైతులు
జూన్ 2024లో విడుదలైన విడతతో పోలిస్తే ఈసారి దాదాపు 25 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే, కేవైసీ పూర్తి కాకపోవడంతో చాలా మంది రైతులు నిరాశ చెందాల్సి వస్తుంది.
Telugu
ఎవరికి PM Kisan ప్రయోజనం
పీఎం కిసాన్ పథకం ప్రయోజనం కోసం ప్రమాణాలను నిర్దేశించారు. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది.
Telugu
PM Kisan అర్హత ఎలా చెక్ చేసుకోవాలి
పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి లబ్ధిదారుల జాబితా లింక్ పై క్లిక్ చేసి అన్ని వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి జాబితాలో మీ పేరును పరిశీలించుకోవచ్చు.
Telugu
PM Kisan డబ్బులు రాకపోతే ఏం చేయాలి
అర్హత ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం పలు మార్గాలను సూచించింది. pmkisan-ict@gov.in కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
Telugu
PM Kisan కోసం హెల్ప్‌లైన్ నెంబర్
మీరు మెయిల్ చేయలేకపోతే.. 155261 లేదా 1800115526 హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే, 011-23381092 నెంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.