భారత్ నుంచి గాడిదలను దొంగిలిస్తున్న చైనా: కారణం తెలిస్తే షాకే
6 రాష్ట్రాల గాడిదల అక్రమ రవాణా
రాజస్థాన్ సహా భారతదేశంలోని 6 రాష్ట్రాల నుండి గాడిదలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇంగ్లాండ్ సంస్థ బ్రూక్ ఇండియా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
పురుషత్వం పెంచడానికట
గాడిద చర్మం పురుషత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీల అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే గాడిదలను చైనా అక్రమంగా తీసుకెళుతోంది.
గాడిద చర్మంతో మందుల తయారీ
చైనాలోని బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీ పరిశ్రమలో గాడిద చర్మం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గాడిద చర్మంతోనే అనేక మందులను కూడా తయారు చేస్తున్నారు.
25,000కి బదులు 15 గాడిదలే
జైపూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఖల్కానీ మాతా గాడిదల జాతరలో కేవలం 15 గాడిదలే వచ్చాయి. ప్రతిసారీ 25,000 కంటే ఎక్కువ గాడిదలు అమ్మకానికి వస్తుంటాయి.
అఫ్గానిస్తాన్, కాఠ్‌మాండు నుండి గాడిదలు
ప్రతి సంవత్సరం జాతరకు లడఖ్, అఫ్గానిస్తాన్, కాఠ్‌మాండు, సింధ్, పంజాబ్, గుజరాత్ నుండి గాడిదలు వస్తుంటాయి. కానీ ఈసారి 15 గాడిదలే వచ్చాయి. దీంతో అక్రమ రవాణా వెలుగుచూసింది.
చైనా బ్యూటీ ప్రోడక్ట్స్ పరిశ్రమ
చైనా సౌందర్య సాధనాల పరిశ్రమలో గాడిద చర్మం విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. దీని కోసం భారత్ సహా ఇతర దేశాల నుండి అక్రమంగా గాడిదలను చైనాకు తరలిస్తున్నారు.