Lifestyle
జ్ఞాపకశక్తిని నియంత్రించడంలో మెదడులోని నోర్‌పైన్‌ఫ్రిన్ రసాయనం ఉపయోగపడుతుంది. ఇది నిద్రించే సమయంలో అంత యాక్టివ్ గా వుండదు... దీనివల్ల కలలను గుర్తుంచుకోవడం కష్టతరం అవుతుంది.
మంచి నిద్రలో వుండగా కలలు వస్తాయి. ఆ సమయంలో మన మెదడు రిలాక్స్ దశలో వుంటుంది. అందువల్లే కలలే కాదు మనం నిద్రమత్తులో చేసే పనులు గుర్తుండవు.
సెరోటోనిన్, అసిటైల్‌కోలిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల అధిక స్థాయిలు కలలు జ్ఞాపకం లేకుండా చేస్తాయి.
మనం నిద్రపోయే విదానం కూడా కలలపై గుర్తుండటంపై ప్రభావం చూపుతుంది. మంచి నిద్ర లేకపోవడం వల్ల కూడా కలలు గుర్తుండవు.
వయస్సు పెరిగే కొద్దీ కలల జ్ఞాపకాలు తగ్గుతాయి. వృద్ధుల కంటే యువకులు ఎక్కువ కలలను గుర్తుంచుకుంటారు.
మనం కలల జ్ఞాపకాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే లేదా మన కలలను రికార్డ్ చేసే అలవాటును పెంపొందించుకోకపోతే, మనం వాటిని గుర్తుంచుకునే అలవాటును అలవర్చుకోకపోవచ్చు.