Lifestyle
చలికాలం వచ్చేసరికి నవంబర్ చివరి నుండి జనవరి ప్రారంభం వరకు రాజస్థాన్ మళ్ళీ పర్యాటకులతో కళకళలాడుతుంది. శీతాకాలంలో ఇక్కడ సందర్శించడానికి ఉత్తమమైన 4 ప్రదేశాలు గమనిస్తే..
ఈ జాబితాలో మొదటి పేరు ఉదయ్‌పూర్, రాజస్థాన్‌లోని సరస్సుల నగరంగా గుర్తింపు ఉంది. శీతాకాలంలో ఇక్కడకు భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు.
ఇక్కడి కోటలు, సరస్సులు ఈ నగరం అందాన్ని మరింత పెంచుతాయి. దానితో పాటు ఇక్కడి ఉష్ణోగ్రత శీతాకాలంలో ఇతర నగరాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
జాబితాలో రెండవ పేరు రాణక్‌పూర్. ఇక్కడ మీరు రాజస్థాన్ చారిత్రక దేవాలయాలను, వన్యప్రాణులు, ప్రకృతిని దగ్గరగా చూసే అవకాశాలను కూడా పొందుతారు.
ఈ ప్రాంతంలో చెరువుల దగ్గర అనేక రిసార్ట్‌లు, అత్యుత్తమ హోటళ్ళు ఉన్నాయి. ఇది కుటుంబాలు లేదా జంటలకు శీతాకాలపు విహారయాత్రకు అనువైనదిగా ఉంటుది.
బండి నగరంలో శీతాకాలపు రాత్రులు 10°Cకి పడిపోతాయి. దాని కోటను సందర్శించడానికి ఇది సరైన సమయం. కళకళలాడే వీధి మార్కెట్లు, సాంప్రదాయ వంటకాలు మీకు కొత్త అనుభూతి పంచుతాయి.
శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను సందర్శించడానికి అధికంగా పర్యాటకులు వస్తారు. డిసెంబర్ నెల అంతా ఇక్కడ పర్యాటకుల తాకిడి ఉంటుంది.
ఎడారిని చూడటంతో పాటు, బంగారు కోటను సందర్శించడం, ఎడారి మధ్యలో టెంట్ సిటీలో ఉండటం పర్యాటకులకు గొప్ప అనుభవంగా ఉంటుంది.