Spiritual

కురుక్షేత్రం అధర్మ యుద్ధయే: ఇవిగో ఆధారాలు

కౌరవ, పాండవులు ఏర్పాటు చేసిన నియమాలు

మహాభారత యుద్ధానికి ముందు ఇరువైపులా నాయకులు నియమాలు ఏర్పాటు చేశారు. అయితే తరువాత వాటిని ఉల్లంఘించారు. ఈ నియమాల గురించి తెలుసుకోండి.

మోసం చేయకూడదు

ప్రతిరోజు యుద్ధం తర్వాత యోధులు ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి. ఎలాంటి మోసానికి పాల్పడకూడదు. 

మాటలతోనే వాగ్వాదం

వాగ్వాదానికి మాటలతోనే ప్రతిస్పందించాలి. సైన్యాన్ని విడిచిపెట్టిన వారిపై దాడి చేయకూడదు.

సమాన యుద్ధం

రథికులు రథికులతో, గజారూఢులు గజారూఢులతో, అశ్వారూఢులు అశ్వారూఢులతో, పదాతిదళాలు పదాతిదళాలతో మాత్రమే పోరాడాలి.వేరే వారితో యుద్ధం చేయకూడదు.

దాడికి ముందు హెచ్చరిక

యోధులు సమానులతో పోరాడాలి. పోరాడటానికి ఇష్టపడని వారిని వదిలేయాలి. దాడి చేసే ముందు శత్రువును హెచ్చరించాలి.

పారిపోతున్న వారిపై దాడి వద్దు

ఇప్పటికే యుద్ధంలో ఉన్నవారిపై దాడి చేయకూడదు. పారిపోతున్న లేదా ఆయుధాలు, కవచాలు లేని వారిపై దాడి చేయకూడదు.

యుద్ధంలో లేనివారిని వదిలేయాలి

బరువులు మోస్తున్నవారు, ఆయుధాలు సరఫరా చేస్తున్నవారు, శంఖం పూరిస్తున్నవారిపై దాడి చేయకూడదు. ఒకే యోధుడిపై గుంపుగా దాడి చేయకూడదు. గాయపడిన వారిపై దాడి చేయకూడదు.

తామర పువ్వులో ఇన్ని ప్రత్యేకతలున్నాయా?

ధంతేరాస్ 2024: ఉప్పుతో పెరగనున్న అదృష్టం, ఎలాగంటే

దీపావళికి లక్ష్మీ పూజలో ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా?

దీపావళికి లక్ష్మీ పూజ చేసిన తర్వాత విగ్రహం ఏం చేయాలో తెలుసా?