Food

అంజీర్ లో పురుగులు ఉంటాయా?

అంజీర్

అంజీర్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈ డ్రై ఫ్రూట్ ని తింటుంటారు. కానీ అంజీర్ మాంసాహార పండు అన్న ముచ్చట చాలా మందికి తెలియదు. 

అంజీర్‌లో కీటకాలు

మీకు తెలుసా? అంజీర్ లో కూడా కీటకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది పండనప్పుడు ఆడ కందిరీగ అంజీర్ పుప్పొడి ప్రత్యేక వాసనను పీలుస్తుంది. అప్పుడు అది ఆ పండులోపలికి వెళుతుంది. 

అంజీర్

పండులోపల మార్గం చిన్నగా ఉండటంతో కందిరీగల రెక్కలు విరిగిపోయి దాని లోపలే పడతాయి. అలాగే ఈ కందిరీగలు పండు లోపలే గుడ్లను కూడా పెడతాయి. మగ కీటకాలకు రెక్కలుండవు.అవి అక్కడే చనిపోతాయి.

అంజీర్ మాంసాహారం ఎలా అవుతుంది

ఆడ కీటకాలు అంజీర్ నుంచి బయటకొచ్చి వేరే అంజీర్ లో గుడ్లు పెడుతుంది. కాబట్టి ఈ విధంగా చాలా చనిపోయిన కందిరీగలు అంజీర్ లోపలే ఉండిపోతాయి. 

అంజీర్‌లో కీటకాలు కనిపించవు

అయితే  అంజీర్ పండ్లను ఎండబెట్టే ప్రాసెస్ లో చనిపోయిన కీటకాలు ఈ పండులోనే కలిసిపోతాయి. అంటే ఎండు అంజీర్ నుంచి చనిపోయిన కీటకాలను తొలగించలేరు. 

అన్ని అంజీర్ లో పురుగులు ఉంటాయా?

అయితే అన్ని అంజీర్ పండ్లలో చనిపోయిన కందిరీగలు ఉంటాయని చెప్పలేం. కానీ పండు లోపల పువ్వులు ఉండటం వల్ల పరాగసంపర్క ప్రక్రియలో ఇలా అయితే జరుగుతుంది.

జైనులు అంజీర్ తినరు

చనిపోయిన కందిరీగ ఉండటం వల్ల ఇది మాంసాహారం అవుతుంది. దీనితో జైనులు అంజీర్ పండ్లను తినరు. చాలా మంది శాఖాహారులు అంజీర్ పండ్లను తినకుండా ఉంటారు. 

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా

రాత్రిపూట అస్సలు ముట్టుకోకూడని ఫుడ్స్

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా