Lifestyle
వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దక్షిణ ఐరోపాలో ఉన్న ఈ దేశం 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ జనాభా 497 మంది మాత్రమే.
దక్షిణ ఐరోపా దేశమైన మొనాకో 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కేవలం 38,631 మంది జీవిస్తున్నారు.
నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం నౌరు. ఇది 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జనాభా సంఖ్య కేవలం 11,947.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని 9 చిన్న ద్వీపాల సమూహం టువాలు. ఇది 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 9,646 మంది మాత్రమే ఇక్కడ ఉంటున్నారు.
ఇటలీతో చుట్టుముట్టబడిన శాన్ మారినో 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. జనాభా సంఖ్య 33,581.
160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లిచెన్‌స్టెయిన్ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉంది. 39,870 మంది ఇక్కడ నివసిస్తున్నారు.
వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ దీవులు 181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. జనాభా సంఖ్య 37,548.
వెస్టిండీస్‌లో ఉన్న ద్వీప దేశం సెయింట్ కిట్స్, నెవిస్ 261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 46,843 మంది ఉంటున్నారు.
భారత ఉపఖండానికి నైరుతి దిశలో ఉన్న మాల్దీవులు దాదాపు 1,200 ద్వీపాల దేశం. చాలా ద్వీపాలు నివాసానికి అనుకూలంగా లేవు. జనాభా సంఖ్య 5,27,799.
ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్య, ఇటాలియన్ ద్వీపం సిసిలీకి దక్షిణంగా ఉన్న మాల్టా 316 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 5,39,607 మంది ఇక్కడ జీవిస్తున్నారు.