Woman

అంబానీ కోడళ్ల జ్యూవెలరీ కలెక్షన్ చూశారా?

అంబానీ లేడీస్ జ్యువెలరీ కలెక్షన్

నీతా అంబానీ మాత్రమే కాదు, అంబానీ కుటుంబంలోని కోడళ్లు కూడా అద్భుతమైన నగలు ధరిస్తారు. అలాంటి వారి జ్యువెలరీ కలెక్షన్ నుండి మీ కోసం కొన్నింటిని ఇక్కడ అందిస్తున్నాము.

అన్‌కట్ డైమండ్ సెట్

శ్లోకా మెహతా ధరించిన అన్‌కట్ డైమండ్ సెట్ చాలా అందంగా ఉంది.  ఇది చాలా ఖరీదైనది అయినప్పటికీ, మీరు దీనిని పోలిన సెట్‌ని కొనుగోలు చేయవచ్చు. 

పెర్ల్ మల్టీలేయర్ హారం

సిల్క్ లెహంగాలో శ్లోకా మెహతా మెరిసిపోతోంది. ఈ రోజుల్లో పెర్ల్ జ్యువెలరీ ట్రెండ్‌లో ఉంది. మీరు చీర, లెహంగా రెండింటికీ దీన్ని ధరించవచ్చు. 

ఐదు పొరల డైమండ్ నెక్లెస్

ఈ ఫోటోలో రాధిక ఐదు పొరల డైమండ్ నెక్లెస్‌ ధరించింది. మార్కెట్లో  మీరు దీనిని పోలిన నమూనాని ధరించవచ్చు. 

పుష్పాలతో చోకర్ నెక్లెస్

ప్రతి స్త్రీ వార్డ్‌రోబ్‌లోనూ చోకర్ నెక్లెస్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి చీరలతో చాలా అందంగా కనిపిస్తాయి. రాధిక ఎరుపు లెహంగాతో పుష్పాల డిజైన్ చోకర్ , మ్యాచింగ్ చెవిరింగులు ధరించారు. 

సింపుల్ డైమండ్ సెట్

సిక్విన్ గోల్డెన్ లెహంగాలో రాధిక లుక్ చూడముచ్చటగా ఉంది. ఆమె దుస్తులకు సింపుల్ లుక్ ఇవ్వడానికి మినిమల్ డైమండ్ సెట్‌ని ధరించారు. నెక్లెస్‌లో అదనంగా పచ్చని పొదిగించారు. 

మల్టీలేయర్ నెక్లెస్

ఇషా అంబానీ ధరించిన మల్టీలేయర్ నెక్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మీరు హర్తాళిక తీజ్‌కి ఏదైనా ప్రత్యేకమైన నగలు ధరించాలనుకుంటే ఇషా అంబానీ ధరించిన ఈ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. 

ఇషా అంబానీ మహారాణి హారం

తమ్ముడు అనంత్ అంబానీ వివాహంలో ఇషా అంబానీ అరుదైన గులాబీ-నీలం వజ్రాలతో తయారు చేసిన మహారాణి హారాన్ని ధరించారు. దీనిని 4 వేల మంది కళాకారులు దాదాపు చాలా నెలల పాటు శ్రమించి తయారు చేశారు. 

మీ చేతుల అందాన్నిరెట్టింపు చేసే మెహందీ డిజైన్లు ఇవిగో

ఏ డ్రెస్‌కైనా సరిపోయే నెమలి పింఛాల్లాంటి అందాల చెవి రింగులు

సునీతా విలియమ్స్: అంతరిక్ష నౌక గురించి ఆసక్తికర విషయాలు

60 ఏండ్ల నీతా అంబానీ సీక్రేట్ ఇది