సాయంత్రం వేడి వేడి బజ్జీలు తింటూ, ఘాటుగా ఉండే టీ తాగితే ఆ మజాయే వేరు. దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా స్ట్రాంగ్ టీ తయారుచేసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
మసాలా టీకి కావాల్సిన పదార్థాలు
నీళ్లు - 1 కప్పు,
పాలు - 1/2 కప్పు,
టీ పొడి - 2 టీస్పూన్లు,
చక్కెర - ఒకటిన్నర టీస్పూన్,
అల్లం - 1/2 అంగుళం,
లవంగం లేదా దాల్చినచెక్క - 1,
యాలకులు - చిటికెడు.
Image credits: instagram
Telugu
టీ పొడి వేసి
స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. అందులో టీ పొడి వేయాలి. టీ రంగు మారే వరకు 2-3 నిమిషాలు మరిగిస్తే మంచిది. ఇది టీ రుచిని మరింత పెంచుతుంది.
Image credits: Social media
Telugu
అల్లం తరుగు
ఆ తర్వాత అందులో తురిమిన అల్లం, యాలకులు, లవంగం, దాల్చినచెక్క వేసి 3-4 నిమిషాలు మరిగించాలి. మసాలాల సువాసన వచ్చే వరకు బాగా మరగనివ్వాలి.
Image credits: Social media
Telugu
రంగు, రుచి
టీ డికాక్షన్ ముదురు రంగు రాగానే పాలు, చక్కెర వేసి మరో 3 నుంచి 4 నిమిషాలు మరిగించాలి. ఈ పద్ధతిలో చేస్తే టీకి మంచి రంగు, స్ట్రాంగ్ టేస్ట్, సువాసన వస్తాయి.
Image credits: Social media
Telugu
టీతో పాటు స్నాక్స్
చివరగా టీని వడగట్టుకుని వేడివేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.
Image credits: Social media
Telugu
టీతో ఆరోగ్యం
అల్లం, యాలకులు, లవంగా వేయడం వల్ల టీ మరింత ఆరోగ్యంగా మారుతుంది.