వెండి పట్టీలకు బదులు నల్లపూసలతో ఉన్న ఈ పట్టీలు ట్రై చేయండి. నల్ల పూసల మధ్య వెండి గవ్వలతో జత చేవారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. మోడ్రన్ దుస్తులకు సూట్ అవుతాయి.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
సింపుల్ నల్లపూసల పట్టీలు
కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ సింపుల్ నల్లపూసల పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. ఇందులో పూసలు సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంటాయి.వాటికి గజ్జెలు కూడా జతచేశారు.చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి
Image credits: Jewelleryshopper@instagram
Telugu
గజ్జెల పూసల పట్టీలు
తక్కువ బరువుండే ఈ గజ్జెల పూసల పట్టీలు రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇందులో నల్లపూసల మధ్య చిన్న చిన్న రాళ్లు, S-లాక్ ఉంటాయి. ఇవి పట్టీల అందాన్ని మరింత పెంచుతాయి.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
సింపుల్ ఈవిల్ ఐ పట్టీలు
పూసలు, గజ్జెల కాంబినేషన్‌లో ఉండే ఈవిల్ ఐ పట్టీలను కూడా రోజూ ధరించవచ్చు. ఇందులో పూసలతో పాటు సిల్వర్ బీడ్స్, ఈవిల్ ఐ ఉంటాయి. రూ.1000 లోపే మీకు ఇందులో చాలా వెరైటీలు దొరుకుతాయి.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
బ్లాక్ స్టోన్ పూసల పట్టీలు
ఈ పట్టీలు సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో అద్భుతంగా ఉంటాయి. ఇందులో మెరిసే నల్లపూసల మధ్య చిన్న చిన్న వెండి రాళ్లు ఉంటాయి. ఇవి మీకు అందంతో పాటు మంచి షైనింగ్ కూడా ఇస్తాయి.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
సాలిటైర్ పూసల పట్టీలు
పూసలతో ఉండే ఈ కడియం లాంటి పట్టీలు మీ పాదాల అందాన్ని పెంచుతాయి. డిఫరెంట్ లుక్ ఇస్తాయి. మీరు దీన్ని సింగిల్ సిల్వర్ చైన్‌తో లేదా అడ్జస్టబుల్ ఎలాస్టిక్‌తో ఎంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
పాన్ షేప్ పూసల పట్టీలు
ఇవి చాలా మెరిసే నల్లపూసల పట్టీలు. వీటిని చాలామంది 'నజర్‌బంద్ పట్టీలు' అని కూడా అంటారు. మధ్యలో ఉన్న వెండి పూసలు దీనికి క్లీన్, కాంట్రాస్ట్ లుక్ ఇస్తాయి.