Lifestyle
నిజజీవితంలోనే కాదు కలలో పాములు కనిపించినా భయపడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కలలో పాము కనిపిస్తే మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
కలలో మీ తలపై పాము ఉంటే.. భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయని అర్థం. అలాగే పాము మింగేస్తే వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు.
మీ కలలో పాము వేటాడి కాటు వేస్తే భయపడకండి. ఈ కల మీ విజయం, శత్రువుల ఓటమికి సంకేతం.
నిజ జీవితంలో తెల్ల పాములు కనిపించడం చాలా అరుదు. ఒకవేళ మీ కలలో తెల్లపాము కనిపిస్తే గనుక మీకు ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు అంతా శుభం కలుగుతుంది.
కలలో పాము తన పై చర్మాన్ని వదిలేస్తున్నట్టు కనిపిస్తే కూడా మంచిదే. ఇది మీకు ఆస్తి లాభాన్ని సూచిస్తుంది.
బంగారు రంగులో లేదా తెల్లగా ఉండే పాము కలలో కనిపించడం చాలా మంచిదంటారు. ఎందుకంటే ఈ పాములు కలలో కనిపిస్తే మీకు అదృష్టం, పితృదేవతల అనుగ్రహం లభిస్తాయి.
చక్కెరను ఎక్కువ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా
పెరుగులో ఎండుద్రాక్ష కలుపుకొని తింటే ఏమౌతుంది?
ఇండియన్ నేవీ ముందు ఆ దేశాలు ఎందుకూ పనిచేయవు
ఏం తింటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది