Lifestyle
చక్కెరను ఎక్కువగా తింటే మీరు బరువు పెరుగుతారు. బీపీ, షుగర్ తో పాటుగా చర్మ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం..చక్కెరతో చేసిన స్వీట్లను కానీ, వేరే ఆహారాలను గానీ ఎక్కువగా తింటే మీరు తొందరగా ముసలివాళ్లు అవుతారు.
చక్కెరలో ఎన్నో రకాల రసాయనాలుంటాయి. ఇవి మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ఆపేస్తాయి. దీంతో చర్మం ముడతలు పడుతుంది. గీతలు ఏర్పడతాయి.
అవును చక్కెర మొటిమలు అయ్యేలా కూడా చేస్తుంది. ఎందుకంటే ఇది ఇన్సులిన్ ను పెంచుతుంది. దీంతో మీ చర్మంలో నూనె ఉత్పత్తి పెరిగి మొటిమలు అవుతాయి.
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మీ చర్మ కణాల్లో రక్త ప్రసరణ, ఆక్సిజన్ బాగా తగ్గుతాయి. దీంతో మీ చర్మంలో తేమ తగ్గి బాగా పొడిబారుతుంది.
చక్కెరతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటే శరీరంలో పోషకాలు తగ్గుతాయి. అలాగే చర్మం పొడి బారుతుంది.
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే సోరియాసిస్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో మీ చర్మం ఎర్రగా, పొడిగా మారుతుంది.