Lifestyle
కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం వల్ల కిడ్నీ వ్యాధిని నివారించవచ్చు. కొన్ని అలవాట్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి.
నీళ్లు తాగకపోవడం కిడ్నీలకు చాలా హానికరం. తక్కువ నీరు లేదా నీరు తాగకపోవడం దీర్ఘకాలికం అయితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు వస్తాయి.
చక్కెర అతిగా తీసుకోవడం వల్ల ఊబకాయం, డయాబెటిస్ వస్తాయి. ఇవి రెండూ కూడా కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
జంక్ ఫుడ్ లో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఇవి హై బీపీకి దారితీస్తాయి. ఇవి కిడ్నీ డ్యామేజ్ కి ప్రధాన కారణాల్లో ఒకటి.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. ఊబకాయం, హై బీపీ వస్తాయి - ఇవి కిడ్నీ వ్యాధికి దారితీస్తాయి.
మూత్రం ఎక్కువసేపు అపుకోవడం వల్ల కిడ్నీలు, మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది.
కొన్ని నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్) మాత్రలు వాడటం వల్ల కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది.