Lifestyle
వియత్నాం వెళ్లడానికి బడ్జెట్ తక్కువ. ఫ్రెండ్లీ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ అక్కడ బాగా ఫేమస్.
అద్భుతమైన అందాలకు కేరఫ్ అడ్రస్ బాలి. ఇక్కడ వసతి, ఆహారం పర్యాటకులకు బాగా నచ్చుతాయి. బడ్జెట్ కూడా తక్కువే.
ఆంగ్కోర్ వాట్, కంబోడియన్ సంస్కృతి పర్యాటకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. తక్కువ ఖర్చుతో వసతి, వీధి ఆహారం ఇక్కడ మీరు ఆస్వాదించొచ్చు.
శ్రీలంకలో అందమైన బీచ్‌ల్లో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ దేశ చరిత్ర, విభిన్న సంస్కృతిని తెలుసుకోవడానికి మీరు పెద్దగా ఖర్చు చేయక్కరలేదు.
తక్కువ బడ్జెట్ తో థాయిలాండ్ బీచ్‌లు, నగరాలు, సంస్కృతిని మీరు తెలుసుకోవచ్చు.
భూటాన్ లో అద్భుతమైన పరిసరాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొండలు, లోయలు, ఆ దేశ సంస్కృతి మీకు ఆనందాన్ని ఇస్తాయి.
భారతదేశం నుండి సులభంగా చేరుకోగల దేశం నేపాల్. పక్కన ఉన్న దేశం కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఈ దేశాన్ని చూసి రావచ్చు.