Food
బ్రోమెలైన్ అనే జీర్ణ ఎంజైమ్ అనాస పండులో ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి , కలిగిన పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బీటా కెరోటిన్, విటమిన్ సి కలిగిన పైనాపిల్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది.
ఎముకల పెరుగుదలకు అవసరమైన మాంగనీస్, కాల్షియం పైనాపిల్ లో పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ అధికంగా ఉన్న పైనాపిల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నీరు అధికంగా ఉన్న పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల బాడీ డీ హైడ్రేట్ అయ్యే సమస్య ఉండదు.
తక్కువ కేలరీలు, ఫైబర్ ఉన్న పైనాపిల్ ని బరువు తగ్గాలనుకునేవారు తినవచ్చు.
విటమిన్ సి ఉన్న పైనాపిల్ తినడం వల్ల కొల్లాజెన్ పెరిగి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.