Telugu

కుండీలో మల్లెలు విరగబూయాలా? ఈ సీక్రెట్ మీకోసమే!

ఇంట్లో కుండీలో పెంచే మల్లె మొక్కకు పూలు సరిగా పూయడం లేదా? అయితే ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు. మొక్క నిండా పూలు పూస్తాయి.
Telugu

పూలు పూయట్లేదా?

మల్లె మొక్క నాటినప్పటికీ అది అలాగే ఉంది, అస్సలు పూలు పూయడం లేదని చాలామంది బాధపడుతుంటారు.

Image credits: instagram
Telugu

అన్నీ వేసినా ప్రయోజనం లేదా?

మంచి మట్టి, ఎరువు, నీళ్లు అన్నీ అందిస్తున్నా కూడా కొన్నిసార్లు మొక్క సరిగా పెరగదు. పూలు కూడా సరిగా పూయవు.

Image credits: instagram
Telugu

లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడండి

మంచి మట్టి, సేంద్రియ ఎరువులతో పాటు మొక్కకు ద్రవరూప ఎరువు (లిక్విడ్ ఫెర్టిలైజర్) కూడా వేయాలి.

Image credits: instagram
Telugu

ఏమేం కావాలి?

దీనికి ఏమేం కావాలంటే.. బెల్లం, వేరుశనగ చెక్క, ఆవు పేడ. వీటితో మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను తయారు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

ఎలా తయారు చేయాలి?

బెల్లం, వేరుశనగ చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దానికి కొద్దిగా నీళ్లు కలిపి, అది పూర్తిగా కరిగిపోయేలా చూసుకోవాలి.

Image credits: chatgpt
Telugu

ఆవు పేడ కలపాలి

ఈ మిశ్రమానికి గోమూత్రం, కొద్దిగా ఆవు పేడ జోడించాలి. బెల్లం, వేరుశనగ చెక్క మిశ్రమంతో ఇవన్నీ బాగా కలిసేలా కలపాలి.

Image credits: instagram
Telugu

మొక్కలకు వేయండి

ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను నెలకొకసారి మొక్కలకు వేస్తే చాలు. మల్లెలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

Image credits: instagram

Gold Studs: మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!

Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో దోశ రెడీ

Pendant: సింపుల్ చైన్ కి క్లాసిక్ లుక్..Rs.1000లోపే సిల్వర్ పెండెంట్

Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!