Telugu

Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో క్రిస్పీ దోశ

Telugu

ఈ దోశ తయారీకి కావాల్సినవి..

ఇన్ స్టంట్ దోశ కోసం మీరు బొంబాయి రవ్వ, అటుకులు, ఉప్పు, పెరుగు, ఒక చెంచా పంచదార ఉంటే చాలు. వీటితో ఈజీగా దోశ పిండి తయారు చేసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

పిండిని ఇలా కలపాలి

ఒక గిన్నె తీసుకుని అందులో రవ్వ, కొద్దిగా పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. కావాలంటే కొన్ని అటుకులు కూడా కలపొచ్చు.
Image credits: instagram
Telugu

కొద్దిసేపు నానబెట్టాలి

ఇలా కలిపిన పిండి మిశ్రమంపై మూత పెట్టి, ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల రవ్వ మెత్తబడి దోశ బాగా వస్తుంది.
Image credits: instagram
Telugu

ఇక దోశ వేయడమే

ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం వేడయ్యాక, కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండితో దోశలు వేసుకోవాలి.
Image credits: instagram
Telugu

చట్నీతో తింటే భలే ఉంటుంది

ఈ కరకరలాడే రవ్వ దోశను కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.
Image credits: instagram

Fenugreek Water: పరగడుపున మెంతుల నీరు తాగితే జరిగేే మ్యాజిక్ ఇదే

Okra Tips: ఈ పొడి చల్లితే...బెండకాయ జిగురు రాదు..!

Hair Growth: జుట్టు ఒత్తుగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఇవి తింటే చాలు!

Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!