బాత్రూమ్‌లోని వాష్ బేసిన్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, దానిపై పసుపు రంగులో గార పడుతుంది. ఈ మరకలు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి.
life Mar 21 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
మురికి వదిలిపోతుంది
ఈ జిడ్డు, మురికిని వదిలించి మీ వాష్ బేసిన్‌ను కొత్తదానిలా మెరిపించేందుకు ఇక్కడ కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే చాలు.
Image credits: Getty
Telugu
వెనిగర్, అమ్మోనియా పౌడర్
ఇది బెస్ట్ కాంబినేషన్. ఒక కప్పు నీటిలో 4 చెంచాల వెనిగర్ కలపండి. ఈ నీటిని మరకలపై చల్లండి. ఆ తర్వాత కొద్దిగా అమ్మోనియా పౌడర్ చల్లి 5 నిమిషాలు వదిలేయండి. బ్రష్‌తో రుద్దితే మరకలు మాయం.
Image credits: Getty
Telugu
నిమ్మకాయ, ఉప్పు
5-6 నిమ్మకాయల తొక్కలను ఉప్పుతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌కు కొద్దిగా హార్పిక్ కలిపి మరకలపై రాయండి. కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్దితే బేసిన్ శుభ్రంగా మారుతుంది.
Image credits: Getty
Telugu
పటిక వాడకం
పటిక పొడిని నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఈ వేడి నీటిని మరకలు ఉన్న చోట పోసి, కాసేపు ఆగి రుద్దితే మరకలు పూర్తిగా పోతాయి.
Image credits: Getty
Telugu
గట్టిగా రుద్దకండి
గట్టిగా రుద్దకండి. అలా చేస్తే గీతలు పడతాయి. వారానికి రెండు సార్లు క్లీన్ చేయండి. వాడిన తర్వాత నీటితో కడిగితే మరకలు పడవు